పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్
Posted by Unknown |  at 4:19 AM
No comments
ఘనంగా తన సినిమాలకు ఆడియో వేడుకలు జరుపుకోవడం, అలాగే మీడియా ముందు సినిమా సక్సెస్ మీట్ లు పెట్టడం పవన్ కళ్యాణ్ కు చేతకాని పని అని అంటారు. పవన్ హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టిన నాటి నుంచి ఎప్పుడూ మీడియా విషయంలో అలాగే తన అభిమానుల విషయంలో లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తూనే ఉంటాడు. దీనికి చాలామంది పవన్ కు ఇటువంటి హడావుడి కార్యక్రమాలు నచ్చవు అని అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు.
కాని అసలు విషయం ఏమిటంటే, చాలా సంవత్సరాల క్రితం పవన్ అన్నయ్య చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో జరిగాయట. ఆ వేడుకకు హాజరు అయిన అనేకమంది స్త్రీలు ఆరోజు విపరీతంగా వచ్చిన చిరు అభిమానుల సందడి మధ్య నలిగిపోవడం చూసిన పవన్ ఆనాటి నుండి తన సినిమాలకు ఇటువంటి ప్రచార కార్యక్రమాలు చెయ్యకూడదని నిశ్చయి౦చుకున్నాడట. అందువల్లనే పవర్ స్టార్ అభిమానులు ఎంతో బలవంత౦ పెట్టినా గబ్బర్ సింగ్ శతదినోత్సవానికి పవన్ అంగీకరించలేదు అని అంటారు. ఆ తరువాత వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో కూడా ఎటువంటి హడావుడి లేకుండా డైరెక్ట్ గా విడుదల అయిపోయింది. అయితే పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా నుంచి పవన్ ఆలోచనలో కొద్దిగా మార్పు వచ్చిందా అని అనిపిస్తోంది.
మొదటగా ఉండదు అని అనుకున్న అత్తారిల్లు ఆడియో వేడుక చాలా ఘనంగా జరిగింది. తరువాత సమైఖ్య ఉద్యమ నేపధ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడడం తరువాత పైరసీ వ్యవహారంలో ఇరుక్కోవడం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నే ఆశ్చర్యంలో ముంచెత్తి వేసిన మెగా హిట్ అందుకున్న అత్తారింటికి దారేది సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో పెట్టి, తన సినిమాను ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు, ప్రేక్షకులకు తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పే పనిలో పడ్డాడట పవర్ స్టార్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సక్సెస్ మీట్ వచ్చే ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉంటుంది అని అంటున్నారు. ఈ వార్తలే నిజమైతే ఈ వార్త పవన్ అభిమానులకు పండుగే అనుకోవాలి.
Tagged as: FILM UPDATES
About the Author
Write admin description here..
Get Updates
Subscribe to our e-mail newsletter to receive updates.
Share This Post
Related posts






0 comments: